కీర్తన Chapter 104 TELIRV Bible Verse Images

కీర్తన 104 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 104 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 104:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు.

కీర్తన 104:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు.

కీర్తన 104:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు.

కీర్తన 104:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు.

కీర్తన 104:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు.

కీర్తన 104:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి.

కీర్తన 104:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయాయి.

కీర్తన 104:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి.

కీర్తన 104:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి మరలి వచ్చి భూమిని కప్పకుండేలా దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు.

కీర్తన 104:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన కొండలోయల్లో నీటిఊటలు పుట్టిస్తాడు. అవి కొండల్లో ప్రవహిస్తాయి.

కీర్తన 104:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి.

కీర్తన 104:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి.

కీర్తన 104:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన మేడ గదుల్లోనుండి ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది.

కీర్తన 104:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు

కీర్తన 104:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు.

కీర్తన 104:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి.

కీర్తన 104:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి.

కీర్తన 104:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు.

కీర్తన 104:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు.

కీర్తన 104:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు చీకటి కమ్మ జేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవిజంతువులన్నీ సంచరిస్తున్నాయి.

కీర్తన 104:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సింహం పిల్లలు వేట కోసం గర్జిస్తున్నాయి. తమ ఆహారాన్ని దేవుని చేతిలోనుండి తీసుకోడానికి చూస్తున్నాయి.

కీర్తన 104:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి.

కీర్తన 104:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు.

కీర్తన 104:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది.

కీర్తన 104:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి.

కీర్తన 104:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందులో ఓడలు నడుస్తున్నాయి. నీవు సృష్టించిన మొసళ్ళు దానిలో జలకాలాడుతూ ఉన్నాయి.

కీర్తన 104:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తగిన కాలంలో నీవు వాటికి ఆహారమిస్తావని ఇవన్నీ నీ దయకోసం కనిపెడుతున్నాయి.

కీర్తన 104:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి.

కీర్తన 104:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి.

కీర్తన 104:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. ఆ విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు.

కీర్తన 104:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక.

కీర్తన 104:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి.

కీర్తన 104:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను.

కీర్తన 104:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను.

కీర్తన 104:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 104 (ASV) »
King James Version (KJV)
Psalms 104 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 104 (GW) »
Berean Bible (BSB)
Psalms 104 (BSB) »
World English Bible (WEB)
Psalms 104 (WEB) »
French Bible (LSG)
Psaumes 104 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 104 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 104 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 104 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 104 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 104 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 104 (RVA) »
Italian Bible (RIV)
Salmi 104 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 104 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 104 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 104 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 104 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 104 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 104 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 104 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 104 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 104 (NORSK) »

TELIRV Book Selection List