1 రాజులు Chapter 6 TELIRV Bible Verse Images

1 రాజులు 6 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 రాజులు 6 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 రాజులు 6:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 480 వ సంవత్సరంలో, అంటే సొలొమోను పాలనలో నాలుగో సంవత్సరం, జీప్‌ అనే రెండో నెలలో అతడు యెహోవా మందిర నిర్మాణం ప్రారంభించాడు.

1 రాజులు 6:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను రాజు యెహోవాకు కట్టించిన మందిరం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు.

1 రాజులు 6:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపం పొడవు మందిరం వెడల్పుతో సమానంగా 20 మూరలు. మందిరం ఎదుట ఆ మంటపం వెడల్పు 10 మూరలు.

1 రాజులు 6:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు మందిరానికి నగిషీ పని చేసిన అల్లిక కిటికీలు చేయించాడు.

1 రాజులు 6:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరం గోడ చుట్టూ గదులు కట్టించాడు. మందిరం గోడలకు పరిశుద్ధ స్థలం బయటి గోడల వరకూ ఆ గదులు గర్భాలయానికి చుట్టూ నాలుగు వైపులా అతడు కట్టించాడు.

1 రాజులు 6:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, మూడవ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఎలా అంటే దూలాలు మందిరం గోడ లోపల ఆనకుండా మందిరం గోడ చుట్టూ బయటి వైపున చిమ్ము రాళ్లు ఉంచారు.

1 రాజులు 6:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మందిరం కట్టే సమయంలో ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టారు. మందిరం కట్టే స్థలం లో సుత్తె, గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల శబ్దం ఎంత మాత్రం వినబడలేదు.

1 రాజులు 6:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరం కుడి పక్కన మధ్య అంతస్తుకు తలుపు ఉంది. మధ్య అంతస్తు గదికీ మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికీ ఎక్కి వెళ్ళడానికి చుట్టూ మెట్ల చట్రాలున్నాయి.

1 రాజులు 6:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా అతడు మందిర నిర్మాణం ముగించి మందిరాన్ని దేవదారు దూలాలతో, పలకలతో కప్పించాడు.

1 రాజులు 6:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరానికి చుట్టూ గదులు కట్టించాడు. ఇవి ఐదు మూరల ఎత్తు కలిగి దేవదారు దూలాల చేత మందిరంతో గట్టిగా సంధించి ఉన్నాయి.

1 రాజులు 6:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.

1 రాజులు 6:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఈ మందిరాన్ని నీవు కట్టిస్తున్నావు కదా, నీవు నా చట్టాలు, న్యాయవిధులు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపితే నీ తండ్రి దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నీ విషయంలో స్థిరపరుస్తాను.

1 రాజులు 6:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులనే నా ప్రజలను విడిచి పెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను.”

1 రాజులు 6:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా సొలొమోను మందిర నిర్మాణాన్ని ముగించాడు.

1 రాజులు 6:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు మందిరం లోపలి గోడలను దేవదారు పలకలతో కట్టించాడు. అడుగు నుండి పైకప్పు వరకూ గోడలను దేవదారు పలకలతో కప్పించాడు. మందిరం నేలను సరళ మాను పలకలతో కప్పించాడు.

1 రాజులు 6:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరం పక్కలను కింది నుండి గోడల పై భాగం వరకూ దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించాడు. అతడు దాన్ని గర్భాలయం కోసం, అంటే అతి పరిశుద్ధ స్థలం కోసం కట్టించాడు.

1 రాజులు 6:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే దాని ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం పొడవు 40 మూరలు.

1 రాజులు 6:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుబ్బలు, వికసించిన పువ్వులు చెక్కి ఉన్నాయి. అంతా దేవదారు కర్ర పనే, రాయి ఒక్కటి కూడా కనిపించ లేదు.

1 రాజులు 6:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నిబంధన మందసాన్ని ఉంచడానికి మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరిచాడు.

1 రాజులు 6:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతి పరిశుద్ధ స్థలం లోపల 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 20 మూరల ఎత్తు ఉంది. దీన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. దేవదారు చెక్కతో చేసిన బలిపీఠాన్ని కూడా ఇదే విధంగా పొదిగించాడు.

1 రాజులు 6:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా సొలొమోను మందిరం లోపల అంతా మేలిమి బంగారంతో పొదిగించి అతి పరిశుద్ధ స్థలం ఎదుట బంగారు గొలుసులు ఉన్న తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు.

1 రాజులు 6:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ భాగాన్నీ విడిచి పెట్టకుండా మందిరమంతా బంగారంతో పొదిగించాడు. అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్న బలిపీఠాన్ని బంగారంతో పొదిగించాడు.

1 రాజులు 6:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు అతి పరిశుద్ధ స్థలం లో 10 మూరల ఎత్తున్న రెండు కెరూబులను ఒలీవ కర్రతో చేయించాడు.

1 రాజులు 6:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక్కొక్క కెరూబుకు 5 మూరల పొడవైన రెక్కలున్నాయి. ఒక రెక్క చివరి నుండి రెండవ రెక్క చివరి వరకూ 10 మూరలు పొడవు.

1 రాజులు 6:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండవ కెరూబు రెక్కలు కూడా 10 మూరలు ఉంది. కెరూబులు రెండింటికీ ఒకే కొలతలు, ఒకే ఆకారం ఉన్నాయి.

1 రాజులు 6:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు కూడా అంతే ఎత్తు.

1 రాజులు 6:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. ఆ కెరూబుల రెక్కలు పూర్తిగా విప్పుకుని ఒకదాని రెక్క ఇవతలి గోడకీ, రెండవదాని రెక్క అవతలి గోడకీ అంటుకుని ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలం లో వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని ఉన్నాయి.

1 రాజులు 6:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ కెరూబులను అతడు బంగారంతో పొదిగించాడు.

1 రాజులు 6:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరం గోడలన్నిటి మీదా లోపలా బయటా కెరూబు ఆకారాలను, ఖర్జూర చెట్ల ఆకారాలను, వికసించిన పూలను చెక్కించాడు.

1 రాజులు 6:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లోపలి, బయట గదుల్లో మందిరం నేలంతా బంగారంతో పొదిగించాడు.

1 రాజులు 6:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతి పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవకర్రతో తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మీ, నిలువు కమ్మీల వెడల్పు, గోడ వెడల్పులో ఐదో భాగం ఉన్నాయి.

1 రాజులు 6:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేసినవి. వాటి మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, వికసించిన పూవుల ఆకారాలు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు. కెరూబుల మీదా ఖర్జూర వృక్షాల మీదా బంగారం పొదిగించాడు.

1 రాజులు 6:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు.

1 రాజులు 6:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండు తలుపులు దేవదారు కలపతో చేసినవి. ఒక్కొక్క తలుపుకు రెండేసి మడత రెక్కలు ఉన్నాయి.

1 రాజులు 6:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి మీద అతడు కెరూబులనూ ఖర్జూర చెట్లనూ వికసించిన పూవులనూ చెక్కించి వాటి మీద బంగారు రేకు పొదిగించాడు.

1 రాజులు 6:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లోపల ఉన్న పెద్ద గదిని మూడు వరసల చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.

1 రాజులు 6:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాలుగో సంవత్సరం జీప్‌ నెలలో యెహోవా మందిరం పునాది వేశారు.

1 రాజులు 6:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పదకొండవ సంవత్సరం బూలు అనే ఎనిమిదో నెలలో దాని ఏర్పాటు ప్రకారం దాని విభాగాలన్నిటితో మందిరం పూర్తి అయ్యింది. దాన్ని కట్టించడానికి సొలొమోనుకి ఏడు సంవత్సరాలు పట్టింది.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Kings 6 (ASV) »
King James Version (KJV)
1 Kings 6 (KJV) »
GOD’S WORD® (GW)
1 Kings 6 (GW) »
Berean Bible (BSB)
1 Kings 6 (BSB) »
World English Bible (WEB)
1 Kings 6 (WEB) »
French Bible (LSG)
1 Rois 6 (LSG) »
German Bible (LUTH1912)
1 Könige 6 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
1 राजे 6 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
1 રાજાઓ 6 (GUJIRV) »
Hebrew Bible (HEB)
מלכים א 6 (HEB) »
Portuguese Bible (BSL)
1 Reis 6 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Các Vua 6 (VIE) »
Spanish Bible (RVA)
1 Reyes 6 (RVA) »
Italian Bible (RIV)
1 Re 6 (RIV) »
Chinese Simplified (CUVS)
列 王 记 上 6 (CUVS) »
Chinese Traditional (CUVT)
列 王 紀 上 6 (CUVT) »
Albanian Bible (ALB)
1 Mbretërve 6 (ALB) »
Swedish Bible (SV1917)
1 Kungaboken 6 (SV1917) »
Russian Bible (RUSV)
3 Царств 6 (RUSV) »
Ukrainian Bible (UKR)
1 царів 6 (UKR) »
Hungarian Bible (KAR)
1 Királyok 6 (KAR) »
Bulgarian Bible (BULG)
3 Царе 6 (BULG) »
Japanese Bible (JPN)
列王紀上 6 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Kongebok 6 (NORSK) »

1 రాజులు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List